ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (11:30 IST)

కారు కొనివ్వలేదని యాసిడ్ తాగిన యువకుడు

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన ఓ యువకుడు ద్రావకం సేవించాడు. తల్లిదండ్రులు తాను కోరిన కారును కొనివ్వలేదన్న కోపంతో యాసిడ్ సేవించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, కోరుట్ల మండలం, కల్లూరులో సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు సీపెల్లి భానుప్రకాష్ (22) గత కొంతకాలంగా కారు కొనివ్వాలని కుటుంబ సభ్యులను కోరుతూ వచ్చాడు. 
 
గత పక్షం రోజులుగా మరింత ఒత్తిడి చేయసాగాడు. అయితే, అతని మాటలను తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లి యాసిడ్ సేవించాడు. ఆ తర్వాత మంటలు తాళలేక కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. 
 
ఇది గమనించిన స్థానికులు భానుప్రకాష్‌న ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. గతంలో కూడా సెల్ ఫోన్ కొనివ్వలేదని భానుప్రకాష్ చేయి కోసుకున్నట్టు సమాచారం. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.