మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: బుధవారం, 2 మార్చి 2022 (18:11 IST)

తప్పుదారిలో వెళ్లాను, సారీ అంటూ ఆత్మహత్య చేసుకున్న వివాహిత

తన భర్త ఉన్నతాధికారి. దీంతో ఆమెకు అదే స్థాయిలో గౌరవం లభించేది. ఉన్నత కుటుంబంలో ఉన్న ఆమె పెడదారిన పట్టింది. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితాన్ని గడపాల్సిన వివాహిత తన చేజేతులా సర్వనాశనం చేసుకుంది. 

 
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఇంద్రపాల్ అనే వ్యక్తి నివాసముండేవాడు. సరిగ్గా పదిసంవత్సరాల క్రితం గీతా అనే యువతితో అతనికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇంద్రపాల్ సిఆర్పిఎఫ్‌లో ఉన్నత ఉద్యోగి.

 
ఇంద్రపాల్ కింద ఎంతోమంది పనిచేస్తుండడంతో అతనంటే గౌరవం.. మర్యాద. క్రిందిస్థాయి ఉద్యోగులు ఇంద్రపాల్ భార్యను చాలా గౌరవించేవారు. సమాజంలో మంచి పేరు ఉన్న ఆ కుటుంబం పరువు తీసింది ఆమె. కారు డ్రైవర్‌గా ఉన్న ముక్తార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంద్రపాల్‌కు ప్రైవేటు కారు డ్రైవర్ ముక్తార్. డ్యూటీలో వదిలిపెట్టి వచ్చేయడం.. మళ్ళీ తిరిగి సాయంత్రం తీసుకురావడం ఇదే పని. 

 
మధ్య మధ్యలో ఏదో ఒక పనిచేస్తుంటాడు. అయితే గీత విషయంలో మాత్రం ముక్తార్ కాస్త అతిగా ప్రవర్తించాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. దీంతో ఆమె లొంగిపోయింది. పిల్లలకు ఏమాత్రం అనుమానం రాకుండా అక్రమ సంబంధాన్ని గీత కొనసాగించింది. అయితే ఈ వ్యవహారం ఎలా బయటకు వచ్చిందంటే ముక్తార్ తరచూ డబ్బులు అడిగి తీసుకునేవాడు. ఇంట్లో ఉన్న డబ్బులు ఇస్తే నా భర్తకు అనుమానం వస్తుంది.. ఆ తరువాత ఇద్దరూ ఇరుక్కుంటామని చెప్పింది గీత.

 
అయినా సరే ముక్తార్‌లో మార్పు మాత్రం రాలేదు. అయితే ఒక స్థలం అమ్మి డబ్బును ఇంట్లో పెట్టి విధుల నిమిత్తం బయటకు వెళ్ళాడు ఇంద్రపాల్. తన ప్రియురాలితో ఎంజాయ్ చేద్దామనుకుని వచ్చిన ముక్తార్ ఆ డబ్బును చూసేశాడు. ఇంకేముంది ఆమెను కట్టేసి డబ్బులు ఎత్తుకుపోయాడు. సుమారు 50 లక్షల డబ్బుతో ఉడాయించాడు. దీంతో ఇంటికి వచ్చిన ఇంద్రపాల్ భార్యను ప్రశ్నించాడు. దోపిడీ దొంగలు ఎత్తుకెళ్ళారని చెప్పింది గీత.

 
అయితే అసలు విషయం బయటపడితే తన పరువు గంగ పాలు అవుతుందని భావించింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్తను క్షమించమని చెప్పి ఒక లేఖలో ఏం జరిగిందో రాసి మరీ చనిపోయింది వివాహిత.