శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (22:23 IST)

ఇదీ చిరంజీవి, పూజా హెగ్డేల రొమాంటిక్ క‌థ‌... దగ్గరకు లాక్కున్న మెగాస్టార్

Chiru- pooja
Chiru- pooja
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఆచార్య‌` చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా మ‌రోసారి ప్రీరిలీజ్ వేడుక‌ను హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో ఏర్పాటు చేశారు. మంగ‌ళ‌వారంనాడు ఈ వేడుక‌కు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, పూజా హెగ్డే, చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన్నారు. ప్రెస్‌మీట్ అనంత‌రం సినిమా గురించి వారంతా చెప్పి కుర్చీలోంచి లేచి నిలుచోగానే ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మీ ఇద్దరితో ఫొటో దిగాల‌నుంద‌ని చిరంజీవిని స్టేజీ కింద‌నుంచి అడిగాడు.
 
Chiru- pooja
Chiru- pooja
చాలా షార్ప్‌ చిరంజీవి గ్ర‌హించిన‌వాడిగా, పూజాతోనా అంటూ.. వెంట‌నే ఆమెను ఇలా మ‌న‌ల్ని చూడాల‌నుకుంటున్నార‌ని.. ఆమెను ద‌గ్గ‌ర‌గా తీసుకుని ఫొటోలకు ఫోజ్‌లిచ్చారు. పూజా హెగ్డేకు అస‌లు విష‌యం తెలీదు. అంతా ఫొటోగ్రాఫ‌ర్ల హ‌డావుడి, స్టేజీమీద యాంక‌ర్ వాయిస్‌, ప‌క్క‌నే సంగీతం రొద‌న‌ల‌లో చిరంజీవి అర్థం అయిన‌ట్లు అర్థం కాన్న‌ట్లు పూజాను ఇలా ప‌ట్టుకుని ఫోజ్ లిచ్చాడు.


ఆ త‌ర్వాత అస‌లు విష‌యం తెలుసుకున్నాక‌.. చిరంజీవి, రామ్‌చ‌ర‌న్‌తో క‌లిసి ఫోజ్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఆ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు స్టేజీపైన మెట్ల ద‌గ్గ‌రకు వెళ్ళి చిరంజీవికి అస‌లు విష‌యం చెప్ప‌గానే.. అరే.. అలానా.. స‌రిగ్గా విన‌ప‌డ‌లేదు. అంటూ.. అప్పుడు చ‌ర‌ణ్‌, చిరంజీవితో క‌లిసి అత‌ను ఫొటో దిగాడు. ఇది చిరంజీవి, పూజా హెగ్డేల రొమాంటిక్ క‌థ‌.