మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (18:16 IST)

రామ్‌చ‌ర‌ణ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ ఉంటే .. చిరంజీవి ఏమ‌న్నారంటే!

Chiru- pawan
Chiru- pawan
ఆచార్య సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌కంటే ముందు మ‌హేష్‌బాబును అనుకున్నార‌నే వార్త‌లో అస్స‌లు నిజంలేద‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కొట్టిపారేశారు. అందా మీడియా క‌ల్పిత‌మే అన్నారు. అయితే చ‌ర‌ణ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ ఉంటే ఎలా వుంటుంద‌నేదానికి చిరంజీవి ఆస‌క్తిక‌రంగా స‌మాధాన‌మిచ్చారు. 
 
సిద్ద పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటే బావుండు అని ఎప్పుడైనా అనిపించిందా..?” అని రిపోర్టర్ అడిగిన ప్రశాంకు చిరు సమాధానమిస్తూ” చరణ్ ఒప్పుకోకపోతే, కుదరకపోతే వేరే యాక్టర్స్ ఎవ్వరైనా న్యాయం చేస్తారు.. కానీ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది. రియల్ గా ఉన్నటువంటి తండ్రి గుణం యాడ్ అవుతుంది అనే ఉద్దేశ్యంతోటే చరణ్ ను తీసుకోవడం జరిగింది. అయితే ఆ పాత్రకు చరణ్ కూడా దొరకకపోతే.. ది బెస్ట్ ఆల్ట్రనేట్,  ఆ ఖాళీని పూరించేది, అదే ఫీల్ నాకిచ్చేది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే.. పవన్ కళ్యాణ్ అదే స్థానంలో ఉంటే నాకు వంద శాతం అదే ఫీల్ ఉంటుంది.. కానీ అంతవరకు ఛాన్స్ తీసుకోలేదు.. అన్ని కుదిరిపోయాయి అలాగా” అని చెప్పారు.