శనివారం, 1 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2025 (10:19 IST)

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

nara lokesh
సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా వాడకంతో సైబర్ నేరగాళ్లకు చిక్కుకునే సాధారణ ప్రజల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయితే ఈసారి మంత్రి పేరుతో సైబర్ నేరగాళ్లు భారీగా డబ్బును కాజేశారు. ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పేరు, ఫోటోను దుర్వినియోగం చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
 
వాట్సాప్‌లో నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి, బాధితులను బెదిరిస్తూ వారి ఖాతాల్లో భారీ మొత్తంలో డబ్బును జమ చేయించుకున్నారు. మొత్తం రూ. 54 లక్షలు ఈ ముఠా కాజేసినట్లు విచారణలో గుర్తించారు. 
 
హెల్ప్ అట్ లోకేష్, హెల్ప్ అట్ ఎన్సీబీఎన్, హెల్ప్ అట్ పవన్ కల్యాణ్ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం చేస్తామని నిందితులు ట్రాప్ చేస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ డీపీతో టీడీపీ ఎన్నారై కన్వీనర్ అంటూ బాధితులకు రాజేష్ అనే వ్యక్తి ఎర వేశాడు. 
 
మంత్రి లోకేష్ పేరుతో అత్యవసరంగా నిధులు కావాలని చెప్పి బాధితులను భారీ మొత్తంలో మోసగించారు. నిందితుడు పుట్టపర్తికి చెందిన రాజేష్ గతంలో కూడా ఎన్నారై టీడీపీ పేరుతో మోసాలకు పాల్పడినట్లు విచారణలో తెలింది. కాగా, వైద్య సాయం పేరుతో ఇప్పటివరకు సుమారు రూ.50 లక్షలకు పైగా వసూళ్లు చేసినట్లు అధికారులు గుర్తించారు.