బుధవారం, 29 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 29 అక్టోబరు 2025 (13:14 IST)

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

peacock met in a road accident
ఓ నెమలి రోడ్డు దాటుతుండగా ఓ బైకర్ వేగంగా వచ్చి దానిపైన ఎక్కించేసాడు. దాంతో అది తీవ్ర గాయాలతో గిలగిల కొట్టుకుని రోడ్డుపై పడిపోయింది. ఆ నెమలి బ్రతికే వుందా లేదా అని కూడా చూడకుండా అలా పడిపోయిన నెమలి ఈకలను పీక్కునేందుకు రోడ్డుపై వెళ్లేవారు ఎగబడ్డారు.
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పక్షి అలా పడిపోతే, కనీసం మానవత్వం లేకుండా నెమలి పింఛాలను పీక్కునేందుకు జనం ఎగబడటం వారి క్రూరత్వాన్ని చూపిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు.