Peacock: తల్లి ప్రేమ- కొండచిలువతో నెమలి ఫైట్.. ఎందుకో తెలుసా? (video)  
                                       
                  
                  				  తల్లి ప్రేమకు హద్దులంటూ వుండవు. తల్లి అనే పదం త్యాగానికి నిదర్శనం. కన్నబిడ్డలను కాపాడుకోవడంలో కన్నతల్లి ఎప్పుడు ముందుంటుంది. ఇది మన మాతృమూర్తులకు సొంతం కాదు. జంతువుల్లోనూ తల్లి ప్రేమకు అద్దం పట్టే సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. 
 				  											
																													
									  
	 
	తాజాగా ఓ నెమలి తన గుడ్లను కాపాడుకునేందుకు ఓ కొండచిలువతో పోరాడింది. వీడియోలో పొదిగిన గుడ్లను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్న నెమలికి షాక్ తప్పలేదు. ఎక్కడి నుంచి పసుపు కొండ చిలువ నెమలి గుడ్లను మింగేందుకు వచ్చింది. అయితే తల్లి నెమలి ఆ గుడ్లను పాముకు బలి కాకుండా కాపాడింది. 
				  
	 
	ఇందు కోసం పాముతో పోరాడింది. ఈ పోరాటంలో నెమలి గెలిచింది. ఆ పాము తల్లి నెమలితో పోరాడలేక చెట్టుపై నుంచి కిందపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.