గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (10:38 IST)

శ్రీశైలం ఘాట్ రోడ్డులో నృత్యం చేస్తోన్న నెమళ్లు.. వీడియో వైరల్

Peacocks
Peacocks
నల్లమల్ల ఫారెస్టులోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో నెమళ్లు నృత్యం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నంద్యాల జిల్లాలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంకు వెళ్లే ఘాట్ రోడ్డులో దాదాపు 50 నెమళ్లు పురివిప్పి నృత్యం చేస్తోన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 
 
ఇదిలా ఉంటే శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు 7 గేట్లను 10 అడుగులు మేర అధికారులు ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఇన్‌ ఫ్లో 2,16,482 క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ ఫ్లో 2,62,356 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.