గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (13:49 IST)

మద్యం మత్తులో కూర్చున్న వ్యక్తిపై నాట్యం చేసిన కొండచిలువ (video)

Python
మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై కొండచిలువ నాట్యం చేస్తోంది. నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్‌పై కొండచిలువ ఎక్కి దిగింది. 
 
పక్కనే పొదల్లో నుంచి వచ్చిన ఆ కొండచిలువ డ్రైవర్ పైకి ఎక్కి నాట్యం చేసింది. ఇంత జరిగినా ఏం జరగనట్లు మద్యం మత్తులో వున్న వ్యక్తి వుండిపోయాడు. 
 
అయితే దీన్ని గమనించిన గ్రామస్తులు షాక్ అయ్యారు. కట్టెల సహాయంతో కొండ చిలువను పక్కకు లాగేశారు గ్రామస్తులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.