ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (13:40 IST)

ముందు బాధ్యతలు.. ఆ తర్వాతే విందులు.. వినోదాలు.. : డిప్యూటీ సీఎం పవన్ (Video)

pawan kalyan
తన సినిమాలపై హీరో, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు బాధ్యతలు.. ఆ తర్వాతే సినిమాలు అన్నారు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే ఐదు మంత్రిత్వ శాఖల బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్లెల్లో అభివృద్ధి పనుల నిర్మాణం కోసం పల్లె పండుగ పేరుతో ఈ నెల 14వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు వారోత్సవాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు... "ఓజీ" అంటూ నినాదాలు చేస్తూ నానా హంగామా చేశారు. 
 
దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ముందు బాధ్యతలు.. ఆ తర్వాతే సినిమాలు అన్నారు. టాలీవుడ్‌లో ఎవరితోనూ తాను పోటీపడను అని అన్నారు. తాను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలి అని గుర్తు చేశారు. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటానని, చిత్రపరిశ్రమ బాగుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుంటుందన్నారు. రాష్ట్రాన్ని బాగుచేసుకుని ఆ తర్వాత విందులు, వినోదాలు చేసుకుందాం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.