బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (10:29 IST)

60 ఏళ్ల మహిళపై యువకుడి అత్యాచారం.. మానసిక వికలాంగురాలైనా?

Rape
వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నారాయణఖేడ్ పట్టణంలో సోమవారం అర్థరాత్రి తిరుగుతున్న 60 ఏళ్ల మానసిక వికలాంగ మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ దుకాణం ముందు మహిళ నిద్రిస్తున్న సమయంలో యువకుడు ఆమెను లైంగికంగా వేధించాడు. 
 
సహాయం కోసం ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆమెను రక్షించారు. స్థానికులను చూడగానే అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. స్థానికుల ఫిర్యాదు మేరకు నారాయణఖేడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
యువకుడిని అదుపులోకి తీసుకుని మహిళను వైద్య పరీక్షల నిమిత్తం నారాయణఖేడ్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వలు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.