శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జులై 2024 (14:49 IST)

30 ఏళ్ల టెక్కీ 130 నిద్రమాత్రలు మింగింది.. ఎందుకో తెలుసా?

suicide
సంగారెడ్డికి చెందిన 30 ఏళ్ల టెక్కీ 130 నిద్రమాత్రలు మింగింది. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. బాధితురాలిని పోలీసులు రీనాగా గుర్తించారు. 
 
కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న ఈమె విడాకులు తీసుకున్నారు. ఆమె డిప్రెషన్‌కు మందులు తీసుకుంటున్నట్లు తెలిసింది అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవపురి కాలనీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న 30 ఏళ్ల మహిళ తన ఇంట్లో శవమై కనిపించింది. గత రాత్రి ఆమె 130 నిద్రమాత్రలు మింగింది. 
 
సోమవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. నిద్రలోనే మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
 అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విచారణ కొనసాగుతోంది.