సంగారెడ్డి హాస్టల్ మెస్.. చట్నీలో చిట్టెలుక.. విద్యార్థులు షాక్ (వీడియో)
Rat in Chutney
ఉదయం కాలేజీ తరగతులకు వెళ్లే ముందు బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో చట్నీ గిన్నెల్లో ఎలుక చక్కర్లు కొట్టడం చూసి విద్యార్ధులు ఖంగుతిన్నారు. నాలుగైదు రోజుల క్రితం విద్యార్ధులు భోజనం నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు బయట నుంచి తెచ్చుకునే భోజనానికి కూడా భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. చట్నీలో ఎలుక ఈదుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ హాస్టల్ చట్నీలో ఎలుక..
— BRS Party (@BRSparty) July 9, 2024
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో గవర్నమెంట్ హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే తిండి పరిస్థితి ఇది.
నాణ్యతలేని భోజనంతో విద్యార్థులకు ఇబ్బందులు. pic.twitter.com/iuJvyFY90u
