బుధవారం, 17 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2025 (23:36 IST)

Divya Suresh: కన్నడ నటి దివ్య సురేష్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదు

Actress Divya Suresh
Actress Divya Suresh
హిట్ అండ్ రన్ కేసులో కన్నడ నటిపై కేసు నమోదు అయ్యింది. బ్యాటరాయణపురలో జరిగిన ఒక హిట్ అండ్ రన్ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడిన వారాల తర్వాత, శుక్రవారం పోలీసులు ఆ వాహనాన్ని కన్నడ నటి దివ్య సురేష్ నడిపినట్లు తెలిపారు. 
 
అక్టోబర్ 4 తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని, ఆ వాహనం నటిదేనని అధికారులు తెలిపారు. పోలీసుల ప్రకారం, కిరణ్ జి, అతని బంధువులు అనుష, అనితతో కలిసి మోటార్ సైకిల్ నడుపుతుండగా, ఒక గుర్తు తెలియని మహిళ నడిపిన నల్లటి కారు ఢీకొట్టిందని చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం ఆమె అక్కడ నుంచి పారిపోయిందని పోలీసులు చెప్పారు. 
 
ఈ ఘటనలో పరారైన దివ్యపై బెంగళూరు పోలీసులు హిట్ అండ్ రన్‌ కేసు నమోదు చేశారు. అంతేకాక, ఆమె కారును కూడా పోలీసులు సీజ్‌ చేశారు. ఈ కేసులో దివ్యను విచారించేందుకు బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు.