శనివారం, 31 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 24 అక్టోబరు 2025 (19:49 IST)

15 అడుగుల కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి (video)

king cobra caught
కింగ్ కోబ్రా. 15 అడుగులకు పైగానే పొడవుగా వుండే నల్లత్రాచును చూస్తే ఎవరికైనా గుండెల్లో దడ మొదలవుతుంది. అలాంటి కింగ్ కోబ్రా రెండు భవనాల మధ్యకు వచ్చింది. దాన్ని ఓ వ్యక్తి అత్యంత చాకచక్యంగా దాన్ని పట్టుకుని బంధించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
 
కింగ్ కోబ్రా లేదా నల్లత్రాచు గురించి కొన్ని ముఖ్య విషయాలు ఒకసారి తెలుసుకుందాము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, పొడవైన విష సర్పాలలో మొదటిదని చెప్పవచ్చు. ఇది సాధారణంగా 18.5 అడుగుల (5.7 మీటర్ల) పొడవు వరకు పెరుగుతుంది. బరువు సుమారుగా 8 కిలోల వరకు ఉంటుంది.
 
కింగ్ కోబ్రా విషం చాలా ప్రమాదకరమైనది. ఇది నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక కాటుతో విడుదల చేసే విషంతో ఒక పెద్ద ఆసియన్ ఏనుగును లేదా సుమారు 20 మంది మనుషులను చంపగల శక్తి దీనికి ఉంటుంది. ఇది తన శరీరంలో మూడింట ఒక వంతు వరకు భూమి నుండి పైకి లేపగలదు. శత్రువులను భయపెట్టడానికి ఇది విలక్షణమైన శబ్దాలను, కొన్నిసార్లు కుక్క అరుపును పోలిన శబ్దాన్ని కూడా చేయగలదు.
 
ఇది భారతదేశం, ఆగ్నేయాసియా, చైనాలోని కొన్ని ప్రాంతాల అడవుల్లో, దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలు, చిత్తడి నేలల్లో ఎక్కువగా జీవిస్తుంది.