సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2024 (17:28 IST)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

King Cobra
King Cobra
పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట రోజుకు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే నివాస ప్రాంతాల్లోకి వచ్చే  పాములను పట్టుకునే వాళ్లు వాటిని చాకచక్యంగా నివాస ప్రాంతాల్లోనుంచి అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టిన సందర్భాలున్నాయి. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్నేక్ క్యాచర్ కోబ్రాను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. 
 
ప్రజలు నివాసం వుండే ప్రాంతానికి కోబ్రా రావడంతో జనం జడుసుకున్నారు. దీంతో అటవీ శాఖకు సమాచారం అందిచారు. వెంటనే స్నేక్ క్యాచర్ ఆ ప్రాంతానికి చేరుకుని.. ఆ పామును పట్టుకునేందుకు తోకను పట్టుకున్నాడు. 
 
ఆ తోకను పట్టుకున్నాడు కానీ.. కోబ్రా మాత్రం అతనికి పడగ చూపెట్టింది. "నన్నే పట్టుకుంటావట్రా" అన్నట్లు పడగ విప్పి భయపెట్టింది. అతని చేతి నుంచి తప్పుకుంది. దీంతో స్నేక్ క్యాచర్‌కు కాస్త భయపట్టుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.