బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2024 (12:16 IST)

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Allu Arjun
Allu Arjun
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై శనివారం రాత్రి అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. థియేటర్‌కు వెళ్లిన కాసేపటికే పోలీసులు చెప్పడంతో తాను వెళ్లిపోయానని బన్నీ చెప్పాడు. అయితే ఆ రోజు థియేటర్‌లో ఆయన ఇంటర్వెల్ వరకూ ఉన్నారని.. జాతర సీన్ కూడా చూశారని 'ఎక్స్' వేదికగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే #alluarjunarrested అనే హ్యాష్‌ట్యాగ్‌ను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. 
 
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై సర్కారు సీరియస్ అయ్యింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సెలబ్రెటీలు, ప్రముఖులు అయితే.. నిబంధనలు వర్తించవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ హీరో అయితే.. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారా అని ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్‌కు పరామర్శలు ఎందుకు.. ఆయనకు కాలు విరిగిందా.. చెయ్యి విరిగిందా.. ఏమైందని ప్రశ్నించారు.
 
కాగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా ఇటీవలే విడుదలైంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడు.