నవంబరులో వివాహం జరగాల్సింది.. ఇంతలోనే రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు కోల్పోయాడు.. (video)
Bike
అయితే అదే సమయంలో అనుకోకుండా బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్‌తో పాటు రైలు పట్టాలపై పడిపోయాడు. వెంటనే తేరుకొని బైక్‌ను తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే.. రైలు దగ్గరకు వచ్చింది. దాన్ని గ్రహించి పక్కకు పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది.
అప్పటికే సమీపానికి వచ్చిన రైలు తుషార్‌ను ఢీకొట్టడంతో తుషార్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ట్రాక్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
మృతుడిని దాద్రిలోని దత్తావాలి గ్రామానికి చెందిన తుషార్ (19) గా గుర్తించారు. అతను ఇటీవలే 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంకా ఏ కళాశాలలోనూ అడ్మిషన్ తీసుకోలేదు. తుషార్ వివాహం నవంబర్ 22న జరగాల్సి ఉందని, ఇంట్లో సన్నాహాలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ విషాదంతో కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
देखिये जल्दबाजी का नतीजा कितना खतरनाक है, ग्रेटर नोएडा में रेलवे फाटक पर बाइक फिसलने से युवक ट्रैक पर गिर गया और ट्रेन की चपेट में आकर उसकी मौत हो गई। सुरक्षा नियमों की अनदेखी की कीमत इतनी भारी चुकानी पड़ी । pic.twitter.com/YpBIC8g6Gf
— गुरु प्रसाद यादव, लखनऊ (@guruprasadyada5) October 13, 2025
