ఆచార్యలో హింస వుంది అందుకే యు/ఎ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇటీవలే సెన్సార్‌కు వెళ్ళింది. ఇందులో కొరటాల శివ మార్క్ కనిపించింది. కథ ప్రకారం ఎంటర్‌టైన్‌మెంట్, కుటుంబ విలువలు వున్నా. మిర్చి సినిమాను మించిన వయొలెన్స్ ఇందులో వుందట. అందుకే యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిసింది. రామ్‌చరణ్ కూడా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శుక్రవారంనాడు సెన్సార్ పొందింది. అదేవిధంగా మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుగా ఈరోజే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈనెల 23న యూసుఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్‌లో ఆచార్య ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకలో సినిమా నేపథ్యం గురించి మెగాస్టార్ వివరించనున్నట్లు సమాచారం. ఈనెల 29న ఆచార్య విడుదల కాబోతుంది. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటించగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మించాయి.