గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (12:14 IST)

ఎన్‌.టి.ఆర్‌.తో జూన్‌లో షూటింగ్ - కొర‌టాల శివ‌

Koratala siva- NTR
Koratala siva- NTR
సినిమాకు రాసే క‌థ‌ను అంద‌రూ చూడాల‌నే రాస్తాం. తెలుగువారి కోస‌మే క‌థ రాయం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ‌య్యాయి క‌నుక నేను త‌ర్వాత రాసే క‌థ కూడా ఆ స్థాయిలో వుంటుంద‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెలియ‌జేశారు. చిరంజీవితో ఆచార్య సినిమా చేసిన ఆయ‌న ఈనెల 29న విడుద‌లకు సిద్ధం చేశారు. ఆ త‌ర్వాత తాను చేయ‌బోయే సినిమా ఎన్‌.టి.ఆర్‌.తోనే వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. 
 
ఇటీవ‌లే ఇంట‌ర్వూలో ఆయ‌న మాట్లాడుతూ, ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా త‌ర్వాత ఎన్‌.టి.ఆర్‌.తో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. జూన్‌లో సెట్‌పైకి వెళుతుంది అన్నారు. అయితే ఇటీవ‌లే ఎన్‌.టి.ఆర్‌. మాల వేసుకుని వున్న‌ట్లు ఫొటోలు వ‌చ్చాయి. అంటే మీ పాత్ర కోసం బాడీ త‌గ్గించుకునే క్ర‌మంలో ఇది ఓ భాగ‌మా అని అడిగితే.. దానికి దీనికి ఏమాత్రం పోలిక లేద‌ని అది ఆయ‌న వ్య‌క్తిగ‌తం అని తెలిపారు. ఈ సినిమాను సుధాక‌ర్ చెరుకూరి, క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌లుగా వున్నారు.
 
అయితే ఇంత‌వ‌ర‌కు పాన్ ఇండియా సినిమాలు చేయ‌ని కొర‌టాల‌కు ఆచార్య రూపంలో వ‌చ్చింది. ఇప్పుడు ఎన్‌.టి.ఆర్‌.తో మ‌రో అవ‌కాశం వ‌చ్చిన‌ట్ల‌యింది.