శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (17:11 IST)

ఆచార్య నుంచి బంజారా సాంగ్ వ‌చ్చేసింది

Acharya song still
Acharya song still
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన సినిమా `ఆచార్య‌`. ఈ చిత్రంలోని బంజారా సాంగ్‌ను.. చిత్ర యూనిట్ సోమ‌వారం సాయంత్రం విడుదల చేసింది. ఆట‌విక నేప‌థ్యంలో సాగే ఈ పాట గ‌తంలో చిరంజీవి న‌టించిన ఓ చిత్రాన్ని త‌ల‌పిస్తుంది. ఇందులో తండ్రీ కొడుకులు వేసిన స్టెప్‌లు నువ్వా నేనా అన్న‌ట్లుగా వున్నాయి. 
 
ఈ పాట ఎలా వుందంటే.. చీమ‌లు దూర‌ని చిట్ట‌డివికి చిరున‌వ్వు వ‌చ్చింది.. కాక రేగింది. మోత మోగింది.. భ‌లే బంజారా మజా మందేరా.. హే.. క‌చేరీలో రెచ్చిపోదాంరా..  అంటూ న‌గ్జ‌ల్స్ డ్రెస్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, చిరంజీవి త‌న గూడెలోంని ప్ర‌జ‌ల‌తో డాన్స్ వేయ‌డం అల‌రించింది.
 
సాంకేతిక స‌మ‌స్య వ‌ల్ల  ముందు ఆడియోను మాత్ర‌మే విడుద‌ల చేసి, ఆ త‌ర్వాత వీడియో కూడా విడుద‌ల చేశారు.
 
కొర‌టాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా కొణిదెల ప్రొడ‌క్ష‌న్లో రూపొందింది. ఈనెల 29 సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.