సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (15:57 IST)

కోతికి ప్రాణం పోసిన ఆర్ఎంపి వైద్యుడు

monkey
విద్యుదాఘాతానికి గురైన కోతి ప్రాణాలను ఓ ఆర్ఎంపీ వైద్యుడు రక్షించారు. ఈ హృదయాన్ని కదిలించే ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా తులసి నగర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జగిత్యాల జిల్లా తులసినగర్‌లో ఓ కోతి విద్యుత్ స్తంభం ఎక్కడంతో దానికి కరెంట్ షాక్ తలిగింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఈ కోతిని గమనించారు. వెంటనే స్థానికుల సాయంతో ఆ కోతిని కిందికి దించి ప్రథమ చికిత్స చేశారు. కొంతసేపటికి తర్వాత ఆ కోతి లేచివెళ్లిపోయింది. 
 
దీంతో స్థానికులంతా ఆ ఆర్ఎంపీ వైద్యుడిని అభినందించారు. ఆర్ఎంపీ వైద్యుడు సమయస్ఫూర్తితో పాటు.. ఆయన దయా గుణాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ అభినందించారు. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతూ నెటిజన్ల మనసు దోచుకుంది.