మంగళవారం, 23 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (09:38 IST)

గుజరాత్‌ టైటాన్స్‌‌పై ముంబై ఇండియన్స్‌ గెలుపు

MI_GT
MI_GT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఉత్కంఠ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌‌పై ముంబై ఇండియన్స్‌ విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్లో గుజరాత్‌ విజయానికి 9 పరుగులు చేయాల్సిన సమయంలో ముంబై పేసర్‌ సామ్స్‌ అద్భుతం చేశాడు. అద్భుత బౌలింగ్‌తో ముంబైకు థ్రిల్లింగ్‌ విక్టరీ అందించాడు.
 
మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్‌ 45, డేవిడ్‌ 44, రోహిత్‌ శర్మ 43 పరుగులతో రాణించారు. 178 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు సాహా, గిల్‌ తొలి వికెట్‌కు 106 పరుగుల ఫ్లయింగ్‌స్టార్ట్‌ ఇచ్చారు.
 
చివరి రోవర్‌ వరకు విజయం గుజరాత్‌దే అన్నట్లుగా మ్యాచ్‌ సాగింది. క్రీజ్‌లో ఫామ్‌లో ఉన్న మిల్లర్‌, తేవాటియా ఉన్నా సామ్స్‌ పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై విజయంలో కీ రోల్‌ పోషించాడు.