శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (08:27 IST)

చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ - సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్ ఓటమి

dc - srh
ఐపీఎల్ 15వ సీజ్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్స్ పోటీల్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు హ్యాట్రిక్ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
దీంతో పాయింట్ల పట్టికలో పదో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ధేశించిన 208 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో విలయమ్స్ సేనకు వరుసగా దెబ్బలు తగలడంతో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.  
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. జట్టులో డివిడ్ వార్నర్ చెలరేగి 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేయగా, రోన్‌మన్ పావెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 67 రన్స్, మిచెల్ మార్ష్ 10, పంత్ 26 చొప్పున పరుగులు చేశారు. మన‌దీప్ డకౌట్ అయ్యాడు. 
 
ఆ తర్వాత 208 పరుగుల విజయలక్ష్య ఛేదన కోసం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా విజయాన్ని 22 పరుగుల దూరంలో వచ్చి ఆగిపోయింది. ఆ జట్టులో అభిషేక్ 7, విలియమ్సన్ 4, రాహుల్ త్రిపాఠి 22, మార్కరమ్ 42 చొప్పున పరుగులు చేశారు. 
 
అయితే, నికోలస్ పూరన్ మాత్రం 34 బంతుల్లో 2 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో విరుచుకుపడి 62 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ, పూరన్ అవుట్ అయిన తర్వాత హైదరాబాద్ ఓటమి ఖరారైపోయింది. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.