బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

దేశంలో తగ్గిన బంగారం వెండి ధరలు

gold
పసిడి ప్రియులకు శుభవార్త. దేశంలో బంగారం వెండి ధరలు తగ్గాయి. బుధవారం నాటి బులియన్ మార్కెట్ ధరల ప్రకారం దేశంలో బంగారం ధర తగ్గింది. నిజానికి బంగారం వెండి ధరలు గత కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చాయి. కానీ, బుధవారం నాటి మార్కెట్ రేట్ల ప్రకారం వీటి ధరలు తగ్గాయి. 
 
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380గా ఉంది. 22 క్యారెట్లపై రూ.400, 22 క్యారెట్లపై రూ.430 చొప్పున ధర తగ్గింది. 
 
అలాగే, దేశీయంగా కిలో వెండి ధర రూ.61,900గా ఉండగా ఉండగా, దీని ధరలో కూడా రూ.600 మేరకు తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు కూడా మార్పులు సంభవించాయి. 
 
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,100గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,350గా ఉంది. 
 
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,100గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51350గా ఉంది. 
 
విశాఖపట్టణం నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47100గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51350గా ఉంది. 
 
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,100గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380గా ఉంది. 
 
ముంబై నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,100గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380గా ఉంది. 
 
చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,460గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,380గా ఉంది.