మరోమారు బాదేశారు.. గ్యాస్ సిలిండరుపై రూ.50 పెంపు
ఆరు వారాల్లో గ్యాస్ సిలిండరుపై మరోమారు భారం మోపారు. 14.2 కేజీల సిలిండర్ ధర రూ.50 పెంచేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఒక సిలిండర్ ధర రూ.1052కు చేరికంది. అయితే, ఈ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేట్ ఇండియన్ లూటీ అంటూ కామెంట్స్ చేశారు.
ఇప్పటికే పెట్రోలు, డీజిలు ధరల పెంపుతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై మరో భారం పడింది. వంట గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెంచడం దారుణమని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు వారాల్లో రెండో సారి సామాన్యులపై గ్యాస్ ధరను చమురు కంపెనీలు రెండోసారి పెంచేశాయి.
తాజా పెంపుతో 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.999.50కి చేరింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.1002 ఉండగా.. తాజా పెంపుతో రూ.1052కు చేరుకుంది. మార్చి 22న సిలిండర్‌పై రూ.50 పెంచిన చమురు సంస్థలు తాజాగా మరో 50 రూపాయలు పెంచడం గమనార్హం.
ఇక ఈ నెల 1న వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.102 పెంచిన సంగతి తెలిసిందే. దీంతో 19 కిలోల సిలిండర్ ధర రూ.2355.50కు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం వల్లే గ్యాస్ సిలిండర్ ధర పెంచాల్సి వచ్చినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఏప్రిల్ 2021 నుంచి ఇప్పటి వరకు సిలిండర్‌పై రూ.190 పెరగడం గమనార్హం.