మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 మే 2022 (23:07 IST)

మ‌హేష్‌ బాబు గ్లామ‌ర్ చూస్తే నాకు టెన్ష‌న్‌ - కీర్తి సురేష్ కామెంట్‌

Kirtisuresh
Kirtisuresh
మ‌హేష్‌ బాబు న‌టించిన `స‌ర్కారువారి పాట‌`ప్రీరిలీజ్ వేడుక‌ శ‌నివారంనాడు హైద‌రాబాద్ యూసుఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ, మ‌హేష్‌బాబు డైలాగ్‌తో పంచ్‌లేస్తూ అభిమానుల్ని అలరించింది. 
 
క‌ళావ‌తిని బ‌హుతిగా ఇచ్చారు - కీర్తి సురేష్
కీర్తి సురేష్ మాట్లాడుతూ, స‌ర్కారువారిపాట‌లో జ‌ర్నీ చేయ‌డం చాలా ఆనందంగా వుంది. ప‌ర‌శురామ్‌గారు క‌ళావ‌తిని నాకు బ‌హుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్స్‌. షూటింగ్‌లో నా పేరు మ‌ర్చిపోయి ర‌ష్మిక అంటున్నారంటూ స‌ర‌దాగా చ‌లోక్తి విసిరారు. కెమెరా మ‌దుగారు నన్ను అంద‌రిమ‌దిలో నిలిచేలా చూపారు. థ‌మ‌న్ సంగీతం బాగుంది.
త‌న‌తో రెండో సినిమా చేశాను. మ‌హేష్‌గారితో షూటింగ్‌లో టైమ్ మేనేజ్ చేయ‌డం క‌ష్టం, డ‌బ్బింగ్ ఆయ‌న గ్లామ‌ర్‌ను ఎలా మేనేజ్ చేయాలో అనేది టెన్ష‌న్‌. మాకు టెన్ష‌న్‌. అభిమానుల‌కు సెల‌బ్రేష‌న్‌. మ‌హేష్‌ బాబుతో చేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. ఆయ‌న ఉన్నారు. ఆయ‌న విన్నారు. ఆయ‌న మీముందుకు వ‌స్తున్నారు. మే12 థియేట‌ర్‌కు వ‌చ్చి సేఫ్‌గా చూడండి. ఆయ‌న రియ‌ల్ లైఫ్  క‌ళావ‌తి న‌మ్ర‌త‌ గారికి థ్యాంక్ యూ అని తెలిపారు.