Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?
భార్యాభర్తల మధ్య విబేధాలు నేరాలకు దారితీస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తలు హత్యలకు ఒడిగడుతున్నారు. తాజాగా సోమవారం తెల్లవారుజామున కేరళ మాంగాడ్లో 45 ఏళ్ల మహిళపై ఆమె భర్త ఎల్పిజి సిలిండర్‌తో దాడి చేయడంతో ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు.
మృతురాలిని మాంగాడ్లోని కారికోడ్లోని అపోలో జంక్షన్ సమీపంలో నివసించే కవితగా గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో వారి ఇంట్లో జరిగిన గొడవ తర్వాత ఆమెపై దాడి చేసిన ఆమె భర్త మధుసూధనన్ పిళ్లైని పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈ సంఘటన తెల్లవారుజామున 12.30 గంటల ప్రాంతంలో జరిగింది.
పిళ్లై కవిత తలపై గ్యాస్ సిలిండర్‌తో అనేకసార్లు కొట్టాడు. సంఘటన జరిగిన సమయంలో ఆ దంపతుల కుమార్తె ఇంట్లోనే ఉందని కూడా పోలీసులు పేర్కొన్నారు. పెద్ద శబ్దాలు విన్న పొరుగువారు ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కవిత హాలులో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వైద్యుడిని పిలిపించారు. అయితే అంతలోపే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పిళ్లైని అరెస్టు చేసి కిలిక్కొల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.