బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (14:05 IST)

సర్కారు వారి పాటకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు

Maheshbabu
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తీ సురేష్ జంటగా నటించే సర్కారు వారి పాట సినిమాకు ఏపీ సర్కారు తీపి కబురు ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌న్ ఇచ్చింది. 
 
ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర‌ పెంచుకోవ‌చ్చంటూ ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
 
దీంతో ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తరహాలో సర్కారు వారి పాట సినిమాకు కూడా థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ రేట్లు పెంచనున్నాయి. 
 
గతంలో సీఎం జగన్‌ను వెళ్లి సినిమా టిక్కెట్ రేట్లు పెంచాలని అభ్యర్థించడంతో  ఏపీ స‌ర్కారు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
తాజాగా స‌ర్కారువారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అనుమ‌తి మంజూరు చేసింది. దీంతో సర్కారు వారి పాట చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.