సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మే 2022 (17:57 IST)

వైఎస్సార్ పింఛ‌న్ల పంపిణీకి రూ.1,547.17 కోట్లు విడుదల

YSR Pension Kaanuka
YSR Pension Kaanuka
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద 60,87,942 మందికి పింఛ‌న్ల పంపిణీకి రూ.1,547.17 కోట్లను ఏపీ సర్కారు విడుదల చేసింది. ఏపీ వ్యాప్తంగా లబ్ధిదారులకు వైఎస్సార్ పింఛన్లను లక్షలాది మంది వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పింఛన్ల పంపిణీ రెండో రోజు కూడా కొనసాగింది. సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల వరకు 77.01 శాతం పింఛన్లు పంపిణీ చేశారు. 47 లక్షల మంది లబ్ధిదారులకు మొత్తం రూ .1193.88  కోట్లు పంపిణీ చేయడం జరిగింది.
 
వైఎస్సార్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే 1న ప్రారంభమై మే 5 వరకు కొనసాగుతుంది. పెన్షనర్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్, ఐరిస్ ఆథెంటికేషన్, రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా పెన్షనర్ల ఇంటి వద్దనే వాలంటీర్లు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారు.
 
రాష్ట్రంలోని అన్ని గ్రామ/ వార్డు సచివాలయాలకు ఇప్పటికే రూ.1,547.17 కోట్లు బదిలీ అయ్యాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బుడ్డి ముత్యాలనాయుడు తెలిపారు. సెలవు దినం అయినప్పటికీ ఆదివారం కూడా 60 లక్షల 80 వేల మందికి పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.