ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మే 2022 (13:50 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

gstimage
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గత నెలలో ఏకంగా రూ.4,262 కోట్ల మేరకు జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. గత యేడాది ఏప్రిల్ నెలలో ఈ వసూళ్లు రూ.3,345 కోట్లుగా ఉన్నాయి. కానీ, ఈ యేడాది మాత్రం రికార్డు స్థాయిలో 22 శాతం పెరుగుదల కనిపించాయి. 
 
అలాగే, పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో సైతం ఈ జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 2021 ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు రూ.4,262 కోట్లుగా ఉంటే, 2022 ఏప్రిల్ నెలలో ఇది రూ.4,955 కోట్లకు చేరుకుంది. 
 
గత యేడాదితో పోల్చితే ఈ పన్ను వసూళ్లలో 16 శాతం వృద్ధి కనిపించింది. అలాగే, దేశంలో కూడా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి.