గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 మే 2022 (19:20 IST)

ఫిట్ నెస్ విష‌యంలో ఆల‌స్యం వ‌ద్దంటున్న ఐశ్వర్యారజిని

Aishwarya Rajini
Aishwarya Rajini
ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వర్యారజిని ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో త‌ర‌చూ క‌నిపిస్తోంది. ధ‌నుష్ మాజీ భార్య అయిన ఆమె ప్ర‌స్తుతం త‌న దైనందిక విష‌యాల‌ను నెటిజ‌న్ల‌తో పాలుపంచుకుంటోంది. రోజూవారీ కార్య‌క్ర‌మాలు వ్యాయ‌మంతో మొద‌ల‌వుతుంద‌నీ, ఇది త‌న అనుభ‌వం నుంచి నేర్చుకున్నాన‌ని చెబుతోంది.
 
Aishwarya Rajini
Aishwarya Rajini
చెన్నైలోని స‌ముద్ర తీరంలోనూ వాకింగ్‌, జాకింగ్ ఆహ్లాద‌క‌ర‌మైన రోడ్ల‌పై స్కేటింగ్ చేస్తున్న ఐశ్వర్యారజిని ఈరోజు త‌న రోజు ఎలా మొద‌ల‌వుతుందో తెలియ‌జేస్తూ పోస్ట్ చేసింది. నా రోజులు తరచుగా తెల్లవారుజామున రైడ్‌తో ప్రారంభమవుతాయి. కొన్ని రకాల శారీరక శ్రమ మిమ్మల్ని ఎప్పుడూ తప్పు చేయదు .వ్యక్తిగత అనుభవం నుండి నేను చెప్తున్నాను...మీ రోజులో ఎప్పుడైనా ఫిట్‌నెస్ ఇవ్వండి... ఇప్పటికే మే! ఆలస్యం చేయవద్దు.  శాంతియుత కాలిబాటలు మ‌న‌శ్శాంతినిస్తాయి. పీనట్ బార్‌లు మరియు ప్రోటీన్ షేక్‌లు శ‌క్తినిస్తాయంటూ పోస్ట్ చేసింది. రైడ్ మ‌ధ్య‌లో ఇలా విశ్రాంతితీసుకుంటూ షేక్ తాగుతుంటాన‌ని తెలియ‌జేస్తుంది.