ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (11:04 IST)

నా స్నేహితురాలు ఐశ్వర్యకు అభినందనలు: ధనుష్

హీరో ధ‌నుష్‌.. రజినీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రికి ఇద్ద‌రు కుమారులు. అయితే 18 ఏళ్ల వివాహ బంధానికి వీరిద్ద‌రూ ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఇద్ద‌రి మ‌ధ్య ఎందుకు మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయో గానీ విడాకులతో విడిపోయారు.  
 
రీసెంట్‌గా ఐశ్వ‌ర్య రజినీకాంత్.. "పయని" అనే మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసింది. తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య మెగా ఫోన్ చేత పట్టారు. ఈ మ్యూజిక్ వీడియో త‌మిళ వెర్ష‌న్‌ను సూప‌ర్ స్టార్ రజినీకాంత్ విడుద‌ల చేయ‌గా.. తెలుగు వెర్ష‌న్‌ను అల్లు అర్జున్‌, మ‌ల‌యాళ వెర్ష‌న్‌ను మోహ‌న్ లాల్ విడుద‌ల చేశారు.
 
అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా.. ఈ మ్యూజిక్ వీడియో గురించి ధ‌నుష్ పోస్ట్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రిచింది. "పయని" మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసిన నా స్నేహితురాలు ఐశ్వర్యకు అభినందనలు. గాడ్ బ్లెస్ యు" అని ధనుష్ పోస్ట్ చేయగా.. దానికి ఐశ్వర్య రజినీకాంత్ కూడా స్పందిస్తూ మాజీ భర్తకు థాంక్స్ చెప్పారు. ఇలా మాజీ భార్యను స్నేహితురాలు అని తెలపడంతో రజనీ, ధనుష్ ఫ్యాన్స్ నిరాశకు లోనైయ్యారు.