బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (07:42 IST)

హీరో శరత్ కుమార్ - రజనీకాంత్ కుమార్తెకు కరోనా

హీరో శరత్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్‌లు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని వారు మంగళవారం రాత్రి ప్రకటించారు. ఐశ్వర్యా రాయ్ తన ఇన్‌స్టా ఖాతాలో తాను చికిత్స పొందుతున్న ఫోటోను షేర్ చేస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ సోకిందనీ, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు పోస్ట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. 
 
అదేవిధంగా సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ట్వీట్‌లో వెల్లడించారు. అన్ని జాగ్రత్తలతో ఉంటున్నప్పటికీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే వుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ టీకాలు వేసుకోండి అంటూ ట్వీట్ చేశారు.