గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (12:53 IST)

బీజేపీ ఎంపీ - మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు కరోనా పాజిటివ్

భారతీయ జనతా పార్టీకి చెందిన ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు కరోనా వైరస్ సోకింది. తేలికపాటి లక్షణాలు ఉండటంతో ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 
 
"నాకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఈ రోజు పరీక్ష చేయించుకున్నాను. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. తనను కలిసిన ప్రతి ఒక్కరూ స్వయంగా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. స్టే సేఫ్" అని గంభీర్ ట్వీట్ చేశారు. మరోవైపు తనతో కాంటాక్ట్ అయినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.