గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (07:30 IST)

ప్రేమ వ్యక్తితోనే ఆగిపోదు : హీరో ధనుష్ సతీమణి ఐశ్వర్య

సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, తమిళ స్టార్ హీరో ధనుష్ భార్య ఐశ్వర్య ధనుష్ ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పారు. ప్రేమ ఒక వ్యక్తికే పరిమితం కాదని, ఒక వ్యక్తితోనే ఆగిపోదంటూ సెలవిచ్చారు. 
 
తన భర్త ధనుష్‌తో విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీంతో ధనుష్ - ఐశ్వర్య దంపతులను కలిపేందుకు ఇరు కుటుంబాల సభ్యులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ప్రధానంగా, పిల్లల భవిష్యత్ కోసం దంపతులిద్దరూ కలిసి ఉండాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్‌లో ఉంటూ వేర్వేరు హోటల్స్‌లో ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఐశ్వర్య ధనుష్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రేమ అనేది ఎంతో అద్భుతమైనది. ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడం. ప్రేమ అనేది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించినది కాదు. నేను ఎదిగే కొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం మారుతూ వస్తుంది. ఇపుడు నాకు నా తల్లిదండ్రులు, నా పిల్లలను ప్రేమిస్తున్నారు. ఒక వ్యక్తితో ప్రేమ ఆగిపోదు" అని సెలవిచ్చారు.