గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (11:11 IST)

బిగ్ బాస్ ఆరో సీజన్.. నాలుగో వారం.. నామినేషన్స్ ప్రక్రియ

big boss
బిగ్ బాస్ ఆరో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఆరో సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తంగా పది మంది నామినేట్ అయ్యారు. అందులో ఇద్దరు కీర్తి భట్, అర్జున్ కల్యాణ్‌ను నాగార్జున నామినేట్ చేయగా.. ఇనాయా, శ్రీహాన్, ఆరోహి, రేవంత్, గీతూ, సుదీప, రాజ్‌, సూర్యలను ఇంట్లోని కంటెస్టెంట్లు నామినేట్ చేశారు. దీంతో ఈ వారం మొత్తం పది మంది నామినేషన్స్‌లో ఉండిపోయారు.
 
బిగ్ బాస్ షోలోనే అత్యంత ముఖ్యమైన ప్రక్రియల్లో ఎలిమినేషన్ ఒకటి. దీన్ని డిసైడ్ చేసేది ప్రేక్షకులే అన్న విషయం తెలిసిందే. వాళ్లు వేసే ఓట్ల ద్వారానే విజేత కూడా డిసైడ్ అవుతారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఇది రోజుకోలా మారుతోంది. దీంతో కంటెస్టెంట్ల స్థానాలు కూడా మారుతున్నాయి.
 
ఆరో సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ చిత్ర విచిత్రంగా సాగుతోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న రేవంత్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. 
 
దీనికి కారణం తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చిన కీర్తి భట్‌కు అత్యధికంగా ఓట్లు వచ్చి ఆమె టాప్ ప్లేస్‌లోకి వెళ్లడమే. దీంతో రేవంత్ రెండో స్థానానికి పడిపోయాడు.