సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (12:34 IST)

కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్.. నేటి నుంచి అసెంబ్లీకి...

ktrktr
కరోనా వైరస్ బారినపడిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనకు సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని తెరాస పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 
 
ఇటీవలే కరోనా వైరస్ బారినపడిన మంత్రి కేటీఆర్‌కు సోమవారం వైద్యులు పరీక్షలు చేయగా, కోవిడ్ నెగెటివ్‌గా ఫలితం వచ్చిందని తెలిపారు. ఈ ఫలితంలో కరోనా నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ధృవీకరించారు. 
 
దీంతో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ప్రారంభమయ్యే సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతారని తెరాస ప్రకటించింది.