మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (10:41 IST)

ఒమిక్రాన్ వైరస్ నుంచి కోలుకున్న తొలి భారతీయడు

మహారాష్ట్రలో ఒమిక్రాన్ వైరస్ బారినపడిన తొలి రోగి ఆ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఆయనకు తాజాగా నిర్వహించిన ఒమిక్రాన్ కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని బుధవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఫలితంగా దేశంలో ఒమిక్రాన్ వైరస్ నుంచి కోలుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. 
 
సౌతాఫ్రికాలో ఈ వైరస్ వెలుగు చూసింది. ఈయన కూడా దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానే జిల్లాకు వచ్చారు. ఈయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజివిట్‌గా తేలింది. 33 యేళ్ల మెరైన్ ఇంజనీర్‌ను ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అక్కడ కొన్ని రోజుల చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. 
 
మరోవైపు, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త రకం వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే 54 దేశాలకు వ్యాపించింది. మరోవైపు, ఈ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.