1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (08:19 IST)

ఊపిరి పీల్చుకున్న తెలంగాణ అధికారులు... ఆ 13 మందికి ఒమిక్రాన్ నెగెటివ్

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన 13 మందికి జరిపిన ఒమిక్రాన్ వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాగే, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు.
 
దేశంలోకి ఒమిక్రాన్ వైరస్ ప్రవేశించిన దృష్ట్యా ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన అధికారులకు కొన్ని సూచలనలు, సలహాలు ఇచ్చారు. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
కాగా, ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి రాష్ట్రానికి 1805 మంది వచ్చారని, వీరిలో 13 మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు మంత్రికి తెలిపారు.  అయితే, వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా, 13 మందికి నెగెటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.