1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (14:44 IST)

యాసంగిలో వేసే వరి పంటలను కొనేది లేదు.. TSమంత్రి

యాసంగిలో వేసే వరి పంటలను ఎట్టి పరిస్థితిలో కొనేది ఉండదు కాబట్టి కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని, వరి ధాన్యం వేస్తే మాత్రం రైతాంగం కష్టాల్లో చిక్కుకుపోతారని మంత్రి హెచ్చరిస్తున్నారు. ఐతే చాలా వరకు భూములు వరి పంటకే సారవంతం కావడంతో ప్రత్యామ్నాయం సాద్యాసాద్యాల గురించి సమాలోచనలు చేస్తున్నారు తెలంగాణ రైతులు.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుల సంక్షేమం గురించి తెలంగాణ ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉందనే అంశం చెప్తూనే యాసంగి పంట కొనేది లేదని తేల్చేయడం పట్ల ప్రస్తుతం చర్చ మొదలైంది. రైతుల వ్యతిరేకత తలెత్తకుండా సున్నితంగా వ్యవహారాన్ని చక్కబెట్టాలనుకున్నారు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి.