శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (11:42 IST)

నేడు నీట్ ఫలితాలు - రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి....

neet
నీట్ 2022 పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా వెల్లడించింది. 
 
ఫలితాలను విడుదలైన వెంటనే విద్యార్థులు నీట్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని విద్యార్థులకు అధికారులకు సూచించారు. neet.nta.nic.in అనే వెబ్‌సైట్‌లో ఫలితాలతో పాటు ఆన్సర్ కీ, మెరిట్ జాబితాను కూడా ఈ రోజే విడుదల చేస్తున్నామని, దాన్ని చెక్ చేసుకోవచ్చని తెలిపింది.