బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

డేంజర్ జోన్‌లో హస్తినాపురి : ఆ విషయంలో ఢిల్లీ ఫస్ట్

delhi pollution
దేశ రాజధాని ఢిల్లీ డేంజర్ జోన్‌లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ (హెచ్.ఈ.ఐ) విడుదల చేసిన ఓ జాబితాలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలన్నీ ఢిల్లీలో దాటిపోయాయని పేర్కొంది. పీఎం 2.5 కారణంగా బీజింగ్‌లో అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్టు తెలిపింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ముంబై 14వ స్థానంలో ఉన్నట్టు తెలిపింది. 
 
సగటు వార్షిక జనాభా వెయిట్ పీఎం 2.5 ఎక్స్‌పోజర్ పరంగా ఢిల్లీ, కోల్‌కతాలను అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో ముంబై 14వ స్థానంలో ఉండగా, టాప్ 20లో మరే ఇండియన్ సిటీ లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
నిజానికి గాలిలో పీఎం 2.5 ఉందంటే మానవులకు తీవ్ర ముప్పు వాటిల్లినట్టే. పీఎం 2.5 కారణంగా ప్రతి లక్ష మందికి 124 మరణాలతో చైనా రాజధాని బీజింగ్‌ అగ్రస్థానంలో ఉండగా, 106 మరణాలతో ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. 99 మరణాలతో కోల్‌కతా 8వ స్థానంలో నిలిచింది. 
 
ఇక, చైనాకు చెందిన ఐదు నగరాలు టాప్‌-20లో ఉండడం గమనార్హం. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 7 వేల నగరాలను లెక్కలోకి తీసుకున్నారు. అయితే, ఆరు ప్రాంతాల్లోని 103 నగరాలను మాత్రమే ర్యాంకింగ్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు.
 
ఇక, సగటు ఎన్ఓ2 ఎక్స్‌పోజర్ పరంగా చూసుకుంటే చైనాలోని షాంఘై అత్యంత చెత్త నగరంగా అగ్రస్థానంలో ఉండగా, భారత్‌లోని ఏ నగరం కూడా టాప్-20లో లేకపోవడం గమనార్హం. పీఎం 2.5, ఎన్ఓ2 విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన నిబంధనలు ప్రపంచంలోని పలు నగరాలు ఎప్పుడో అధిగమించేసి ముప్పును కొని తెచ్చుకున్నాయి.