శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (13:03 IST)

గుజరాత్ రాష్ట్రంలో రూ.1125 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్

drugs
గుజరాత్ రాష్ట్రంలో 1125 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాన్ని ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది. వడోదర పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీపై దాడి చేయగా, మొత్తం 225 కేజీల మెఫెడ్రోన్ అనే డ్రగ్స్ వెలుగుచూసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.1125 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. 
 
ఈ కేసుకు సంబంధించి ఫ్యాక్టరీకి చెందిన ఐదుగురు భాగస్వాములతో పాటు దినేష్ ధృవ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎస్ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను బరూచ్ చిల్లా సాంఖ్య జీఐడీసీలో ఓ రసాయన కర్మాగారంలో తయారు చేసినట్టు గుర్తించారు. ధృవ్ నార్కోటిక్స్ కేసులో గతంలో 12 యేళ్లపాటు జైలుశిక్ష కూడా అనుభవించి విడుదలయ్యాడు. మళ్లీ ఇదే వ్యపారంలో నిమగ్నమయ్యాడు.