బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (15:27 IST)

రిలయన్స్ జియో సూపర్ ఆఫర్.. రూ.2,999 రీచార్జ్ చేసుకునే వారికి?

jioservice
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.2,999 రీచార్జ్ చేసుకునే వారికి అంతే విలువైన ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ కాల వ్యవధి ఏడాది. ప్రతి రోజు 2.5 జీబీ డేటాను ఏడాది పొడవునా ఉచితంగా పొందొచ్చు. 
 
అంతేకాదు 75 జీబీ ఉచిత డేటా అదనంగా లభిస్తుంది. ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. 
 
ఈ ప్లాన్ తీసుకున్న వారికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. విడిగా ఈ ప్లాన్ తీసుకోవాలంటే రూ.499 అవుతుంది. వీటికి అదనంగా రూ.750 విలువైన అజియో కూపన్, నెట్ మెడ్స్, ఇక్సిగో డిస్కౌంట్ ఆఫర్లు కూడా లభిస్తాయి. 
 
రూ.2,879 వార్షిక ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే రోజువారీగా 2జీబీ డేటా లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. కాల్స్ కూడా అపరిమితంగా చేసుకోవచ్చు.