బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 3 ఆగస్టు 2022 (23:36 IST)

యాపిల్ తురిమి తీసుకుంటే...

apple
ఆపిల్ పండు తినడం వల్ల మలబద్ధకం వుండదు. ఆమ్లం తగ్గిస్తుంది. ఆరోగ్యాభివృద్ధికి సహకరిస్తుంది. సక్రమంగా ఆపిల్ తింటూ వుంటే అనేక వ్యాధులు తగ్గిపోతాయి. చంటి పిల్లలకు బాగా పండిన ఆపిల్ తినిపిస్తే వారు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. రోజుకు ఒక ఆపిల్ తింటుంటే వైద్యుని అవసరం వుండదని అంటారు.
 
డయేరియా సమస్య ఉన్నవారు యాపిల్‌ను తురిమి దాని రంగు మారిన తర్వాత నెమ్మదిగా తినాలి. డయేరియాకి ఎప్పటి నుంచో వున్న పరిష్కారం నేరేడుపండ్లు. నేరేడుపండ్ల జామ్‌ని ప్రతి 3 గంటలకోసారి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. 
 
పాదాలకు కాయలు వస్తే ఆముదం లేదా ఇ విటమిన్ క్యాప్సూల్స్‌తో రుద్దితే పోతాయి. ప్రతీరోజు ఇదేవిధంగా రెండు వారాలపాటు రుద్దాలి. ఒక్కోసారి పాదాలకు వాసనొస్తుంది. అలాంటి పాదాలకు ఈ చిట్కాను ప్రయత్నించండి. ఓ పాత్రలో నీళ్ళుపోసి నాలుగు లేదా ఆరు టీ బ్యాగ్‌లను పావుగంట నుంచి ఇరవై నిమిషాల వరకూ నానబెట్టాలి. ఆ నీళ్ళను పెద్ద బేసిన్‌లో పోసి పాదాలు మునిగేంతగా నీళ్ళు కలిపి అరగంటసేపు పాదాలను ఆ నీళ్ళలో ఉంచాలి. పాదాల వాసనకు కారణమయ్యే బాక్టీరియానీటీలో ఉన్న' టానిన్' పోగోతుంది. తర్వాత పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజుకి కొన్ని సార్లు చొప్పున రెండు వారాలపాటు చేస్తే వాసన పోతుంది. 
 
మోషన్‌ సిక్‌నెస్‌కి పిప్పరమెంట్ ఆయిల్ కొన్ని చుక్కలను అర స్పూను పంచదారకి కలుపుకుని తినాలి. పిప్పరమెంట్ వాడిన టీ తాగవచ్చు. మామిడి, బొప్పాయి, ఫైనాపిల్, కివి పండ్లు, వీటిని తింటే ఫలితముంటుంది. పొట్టలో ఎంత ఇబ్బందిగా వున్నా కొన్ని పండ్లలోని ఎంజైముల వల్ల తగ్గిపోతుంది.  
  
అజీర్ణం వల్ల గ్యాస్ సమస్య మొదలవుతుంది. ఉపశమనానికి అల్లం లేదా సోపుగింజలు వాడిన టీ తాగాలి. మోషన్‌సిక్‌నేస్ సమస్య పోవాలంటే ఒక గ్లాసు మంచి నీటిలో అరస్పూన్ అల్లంపొడిని కలిపి తాగాలి. 
 
చిన్న చిన్న గాయాలకు ఐసుగడ్డలను లేదా బాగా చల్లగా వున్న వేటినైనా గాయాలు, బెణుకులు, దెబ్బలు, నొప్పులకి గురైన శరీర భాగంపై కాసేపు ఉంచితే ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీళ్ళుపోసిన గిన్నెలో తురిమిన ఉల్లిపాయ, బంగాళాదుంపల్ని వేసి నొప్పి పెడుతున్న చేతిని లేదా పాదాన్ని ఆ నీళ్ళలో  కాసేపు ఉంచాలి. అలా ఉంచితే నొప్పి మటుమాయం.