1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (18:13 IST)

బనానా చిప్స్ తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు... (Video)

Banana Chips
బనానా చిప్స్ బాగా డీప్‌గా నూనెలో వేయించి ప్యాక్ చేస్తుంటారు. వాస్తవానికి బనానా చిప్స్ ఆరోగ్యకరమైన బరువు తగ్గించే అల్పాహారం కాదు. ఇవి బాగా వేయించిన చక్కెర లేదా ఉప్పు కలిపిన అరటిపండ్లు. దీని ఫలితంగా బనానా చిప్స్ ప్రతి అరకప్పుకు 210 కేలరీలతో పాటు 12.5 గ్రాముల కొవ్వును కలిగి వుంటాయి.

 
దుకాణాల్లో లభించే బనానా చిప్స్ వేయించబడి తియ్యగా ఉంటాయి. వాటిలో కొవ్వు- చక్కెరలు భారీగా ఉంటాయి. ఓ అధ్యయనం ప్రకారం బనానా చిప్స్‌లో చక్కెర కలుపుతారు. ఇది ఊబకాయం, గుండె జబ్బులు- మధుమేహానికి దారితీస్తుంది. కనుక చాలా అరుదుగా వీటిని తీసుకోవడం చేయాలి.

 
ఓ కప్పు బనానా చిప్స్‌లో దాదాపు 12 గ్రాముల చెడు కొలెస్ట్రాల్ వుంటుంది కనుక అది గుండెకు మంచిది కాదు. అంతేకాదు... కొందరికి బనానా చిప్స్ అలెర్జీని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆస్తమా సమస్య వున్నవారిలో కొందరికి బనానా చిప్స్ అస్సలు పడవు. వారు బనానా చిప్స్ తిన్న తర్వాత ఆస్తమా సమస్య తలెత్తే అవకాశం లేకపోలేదు. కనుక ఎలర్జీలు వున్నవారు వీటికి దూరంగా వుండటం మంచిది.