నేరేడుపళ్లు తినేవారికి ఈ ప్రయోజనాలు షురూ... (video)
ఈ కాలంలో నేరేడు పండ్లు లభిస్తాయి. ఇవి సీజనల్ పండ్లు. ఈ సీజన్ తప్ప మిగిలిన సీజన్లలో దొరకవు. నేరేడు పండ్లు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. నేరేడులో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. పెరిగిన హిమోగ్లోబిన్ స్థాయి రక్తం శరీరంలోని అన్ని భాగాలకు మరింత ఆక్సిజన్‌ను తీసుకువెళ్లేలా చేస్తుంది. ఫిట్‌గా ఉంచుతుంది.
క్రమం తప్పకుండా చిగుళ్ళ నుండి రక్తస్రావం అవుతుంటే నేరేడు ఆకులను నమలడం ద్వారా చిగుళ్ళ నుండి రక్తస్రావం ఆగిపోతుంది. ఈ ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. చిగుళ్లలో రక్తస్రావం జరగకుండా చేయడంలో మేలు చేస్తాయి.
నేరేడు అనేది యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ ఎ యొక్క పవర్‌హౌస్. ఇది అకాల వృద్ధాప్యం, కళ్ళకు హానిని లేకుండా చేస్తుంది. అంతేకాదు ఇది అవాంఛిత మొటిమలు, ముడతలు, మచ్చల నుండి కాపాడుతుంది.
పొటాషియం పుష్కలంగా ఉన్నందున నేరేడు పండ్లు తినడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తక్కువ కేలరీలు, నీరు, కొవ్వులో సున్నా కొలెస్ట్రాల్‌తో కూడి ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీల కారణంగా వీటిని తినేయవచ్చు.