శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 4 ఆగస్టు 2022 (23:12 IST)

పచ్చికోడి గుడ్లు తీసుకుంటే ఏమవుతుంది?

eggs
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నది తెలిసిందే. కోడిగుడ్డు మన శరీరానికి బలాన్ని ఇస్తుంది. వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సహజంగా ఉడకబెట్టిన కోడుగుడ్లు తింటుంటాం. ఐతే పచ్చి గుడ్లు తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి.

 
పచ్చి గుడ్లు తీసుకోవడం వల్ల మెదడుకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గుడ్డులో ఉండే విటమిన్ బి-12 గుడ్డును ఉడికించినప్పుడు కోల్పోతుంది.

 
ఒమేగా 3 ప్రొటీన్ జింక్ పచ్చి గుడ్లలో ఉంటుంది, ఉడకబెట్టినప్పుడు అవి లేకుండా పోతాయి. గుడ్లలో ఉండే ఒమేగా 3 ప్రొటీన్, జింక్ మన కండరాలు, ఎముకలను బలాన్నిస్తాయి. కనుక పచ్చి గుడ్లను తింటుండాలి.

 
పచ్చి గుడ్డు జుట్టు, చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బయోటిన్ గుడ్డు పచ్చసొనలో ఉంటుంది. ఇది జుట్టు- చర్మానికి పోషక మూలకాలను అందిస్తుంది.