గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 4 ఆగస్టు 2022 (22:57 IST)

టాబ్లెట్స్ ఇలా వేసుకోరాదు... ఏమవుతుందంటే?

tablets
అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. నారింజ లేదా నిమ్మరసంతో కలిపి కొందరు మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 

 
నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం తటస్థీకరిస్తుంది. కనుక అలా చేయరాదు.

 
పాల ఉత్పత్తులు శరీరంలో విభిన్నమైన ప్రక్రియలకు కారణమవుతాయి. యాంటీబయాటిక్స్ తీసుకుంటూ వాటితో పాటు పాలు తాగుతూ ఉంటే పాలలోని కాల్షియం, మెగ్నీషియం ఔషధం యొక్క ప్రభావాన్ని పరిమితం చేస్తాయి. కనుక యాంటీబయాటిక్ మందులను అలా తీసుకోరాదు.
 
కొందరు నిద్రపట్టేందుకు మాత్రలు వేసుకుంటుంటారు. అలాంటివారు ఆ స్లీప్ మెడిసిన్‌తో డార్క్ చాక్లెట్ తినకూడదు. ఈ చాక్లెట్ నిద్రపోయే ఔషధాన్ని పూర్తిగా తటస్థీకరిస్తుంది. ఫలితంగా రక్తపోటు బాగా పెరుగుతుంది.